మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 02, 2020 , 08:50:00

డ్యాన్స్‌లతో ర‌చ్చ చేసిన హౌజ్‌మేట్స్

డ్యాన్స్‌లతో ర‌చ్చ చేసిన హౌజ్‌మేట్స్

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఆదివారం ఎపిసోడ్ అంతా స‌ర‌దాగా సాగింది. అవినాష్‌, రాజ‌శేఖ‌ర్‌లు నోయ‌ల్ అన్న మాట‌ల గురించి ముచ్చ‌టిస్తుండ‌గా, అది విన్న నాగార్జున హౌజ్ వేడివేడిగా ఉంది. దీనిని మ‌నం కూల్ చేయాలి అంటూ ఇంటి స‌భ్యుల‌తో డ్యాన్స్‌లు చేయించారు. ముందుగా ఇంటి స‌భ్యుల‌ను రెండు స‌భ్యులుగా విభ‌జించి ఒక గ్రూప్ కెప్టెన్ అఖిల్ మ‌రో గ్రూప్ కెప్టెన్ అభిజిత్‌గా ఉన్నారు.  అభిజిత్ టీంలో హారిక, అమ్మ రాజశేఖర్‌, అరియానా, మెహబూబ్ ఉండ‌గా, అఖిల్ టీంలో , అవినాష్‌, సోహైల్‌, లాస్యలు ఉన్నారు. పాటకు సంబందించిన మ్యూజిక్‌ ప్లే అయితే.. వెంటనే పాటని గెస్‌ చేసి బజర్‌ ప్రెస్ చేసి ఆ సాంగ్ ఏంటో చెప్పాల్సి ఉంటుంది. 

మొదటగా హలోబ్రదర్‌ సినిమాలోని ప్రియ రాగాలే పాట మ్యూజిక్‌ ప్లే కాగా అభిజిత్ బ‌జ‌ర్ ప్రెస్ చేశాడు. దీంతో వారికి డ్యాన్స్ చేసే అవ‌కాశం రాగా రాజ‌శేఖ‌ర్, హారిక‌లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. రెండోసారి ‘దారి చూడు.. దుమ్ము చూడు మామ’  పాటను టీమ్‌ బీ లీడర్‌ అఖిల్ గెస్ చేసి బ‌జ‌ర్ ప్రెస్ చేశాడు. ఈ పాట‌కు సోహైల్‌, మోనాల్‌లు డ్యాన్స్ చేశారు. మొత్తం తొమ్మిది రౌండ్స్ ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూ గేమ్ ఆడించ‌గా ఈ టాస్క్ లో అఖిల్ టీం గెలిచిన‌ట్టు నాగార్జు ప్రక‌టించారు. అభిజిత్ టీం కూడా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిందని అన్నారు.

ఎలిమినేష‌న్ టైం వ‌చ్చే స‌రికి అంద‌రి ముఖాల్లో టెన్ష‌న్ నెల‌కొంది. శ‌నివారం రోజు అఖిల్‌, మోనాల్ సేవ్ కాగా ఆదివారం అరియానా, లాస్య‌లు సేవ్ అయ్యారు. చివ‌రిగా మెహ‌బూబ్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ మిగిలారు. వీరిద్ద‌రి క‌న్ఫెష‌న్ రూంలోకి పిలిచి ఆ త‌ర్వాత చాలా డ్రామా క్రియేట్ చేశారు.  కాగా, ఈ వారం అనారోగ్యం కార‌ణంగా నోయ‌ల్   ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ళిన విష‌యం తెలిసిందే.


logo