బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 11:31:06

సుశాంత్ కోసం ఎదురు చూపులు...!

సుశాంత్ కోసం ఎదురు చూపులు...!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది. ఆయ‌న ఎలా మ‌ర‌ణించాడ‌నే దానిపై అనేక అనుమానాలు తలెత్తుతుండ‌గా, సీబీఐ ఈ కేసుని వీలైనంత త్వ‌ర‌గా చేధించాల‌ని భావిస్తుంది. అయితే మంచి భ‌విష్య‌త్ ఉన్న సుశాంత్ ఇక తిరిగి రాడ‌ని తెలిసిన అభిమానులు, శ్రేయోభిలాషులు, స‌న్నిహితులు ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఇక సుశాంత్ పెంపుడు కుక్క(ఫ‌డ్జ్‌) విష‌యానికి వ‌స్తే సుశాంత్ మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుండి ఆయ‌న కోసం ధీనంగా ఎదురు చూస్తుంద‌ట‌. డోర్ వైపే త‌దేకంగా చూస్తూ అలానే కూర్చుండిపోతుంద‌ట‌. త‌న‌ని ఎంతో ప్రేమ‌గా, ఆప్యాయంగా చూసుకున్న య‌జ‌మాని క‌నిపించ‌క‌పోవ‌డంతో  ఫడ్జ్‌ బెంగ పెట్టుకుంది. సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత‌ కుటుంబ స‌భ్యులు ఫ‌డ్జ్‌ని కూడా పాట్నా తీసుకెళ్ళ‌గా, సుశాంత్ మేన‌కోడ‌లు  మల్లికా, ఫడ్జ్‌ ఎదురుచూపులకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. సుశాంత్ వ‌స్తాడేమోన‌న్న ఆశ‌తో డోర్‌వైపే చూస్తుంద‌ని కామెంట్ పెట్టింది. నల్ల లాబ్రడార్‌ కుక్క అయిన ఫడ్జ్..   సుశాంత్‌ మృతిని తట్టుకోలేక  చ‌నిపోయింద‌ని పుకార్లు పుట్టించారు. అవ‌న్నీ అస‌త్యాలు అని మ‌ల్లికా పోస్ట్‌తో తేలింది.
logo