శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 12:03:05

ఈ నెల 28 నుంచి కౌన్‌ బనేగా కరోడ్‌పతి

ఈ నెల 28 నుంచి కౌన్‌ బనేగా కరోడ్‌పతి

ముంబై : బుల్లితెర రియాలిటీ షో కౌన్‌బనేగా కరోడ్‌ పతి (కేబీసీ) సీజన్‌-12 ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ బాద్‌షా అమితాబచ్చన్‌ షోను హోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆయన ప్రతి రోజూ 12 నుంచి 14 గంటల పని చేస్తున్నారు. షో ఈ నెల 28 నుంచి వరకు కేబీసీ-12 సోమవారం నుంచి శుక్రవారం వరకు సోని టీవీలో రాత్రి 9గంటల వరకు ప్రసారం కానుంది. కొవిడ్‌-19 భద్రతా చర్యల కారణంగా 12వ సీజన్‌ గత సీజన్ల కంటే భిన్నంగా ఉండనుంది.

ఈసారి ‘ఫోన్ ఏ ఫ్రెండ్’ ఫార్మాట్‌లో మార్పులు చేశారని, పోటీదారులు ఫోన్‌ ఏ ఫ్రెండ్‌కు బదులు వీడియో కాల్‌ ఏ ఫ్రెండ్‌ను తీసుకువచ్చారు. వీడియో కాల్‌లో ప్రశ్న అడగాల్సి ఉంటుంది.  అలాగే ‘జోడీదార్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి షోలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అవకాశం లేదని సమాచారం. షో ఆరు వారాల పాటు ప్రసారం కానుంది. ప్రశ్నలను మరింత కఠినంగా తీర్చిదిద్దారు.

ఇదిలా ఉండగా.. అమితాబచ్చన్‌ తాను సెట్స్‌పై ఎలాంటి అవకాశాలు తీసుకోనని, వైరస్‌కు వ్యతిరేకంగా తగిన రక్షణ నిబంధనలు పాటిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఫేస్‌ షీల్డ్‌ ధరించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. సురక్షితంగా ఉండండి.. రక్షణలో ఉండండి’ అంటూ లెజెండ్‌ క్యాప్షన్‌ను జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. అమితాబ్ బచ్చన్ జూలైలో కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించిన తర్వాత దవాఖానలో చేరగా.. ఆగస్ట్‌ 2న టెస్ట్‌ చేసిన అనంతరం నెగెటివ్‌ రాగా డిశ్చార్జ్‌ అయ్యారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


View this post on Instagram

... be safe .. and be in protection ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


logo