ఇన్నాళ్లు గ్రౌండ్లో సందడి చేసిన హర్భజన్ సింగ్ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం భజ్జీ హీరోగా ఫ్రెండ్ షిప్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
మరి కొద్ది రోజులలలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం,హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగులో చిత్ర ట్రైలర్‌ని నాగార్జున రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు. ఓ అమ్మాయి హత్య జరగడం.. అందులో భజ్జీతో పాటు పలువురు కాలేజ్ స్టూడెంట్స్‌ని బాధ్యులని చేస్తూ అరెస్ట్ చేయడం ట్రైలర్లో గమనించవచ్చు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
‘ఏ ఒక్క స్త్రీ.. మగవాడి ప్రత్యేక అవసరం కోసం సృష్టించింది కాదు.. ఆడది అంటే మనకు బాధ్యత. ఈ అందమైన విషయాన్ని మాకు నేర్పింది ఫ్రెండ్ షిప్’ అనే వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. జాన్ పాల్ రాజ్ మరియు శ్యామ్ సూర్య దర్శకత్వంలో రూపొందినీ సినిమాని టోవా స్టూడియోస్ మరియు సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్ పై జేపీఆర్ – స్టాలిన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డీఎం ఉదయ్ కుమార్ సంగీతం సమకూర్చగా.. సి.శాంతా కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.