ఇటీవలి కాలంలో చాలా మంది అందాల భామలు పెళ్లి కాకుండానే తల్లి ప్రమోషన్ అందుకుంటున్నారు. ఆ మధ్య అమీ జాక్సన్ కూడా పెళ్లి చేసుకుండానే తల్లి అయింది. ఇక ఇప్పుడు ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫ్రిదా పింటో త్వరలో తల్లి కాబోతుందట. ప్రియుడు కోరీ ట్రాన్‌తో 2017 నుండి డేటింగ్లో ఉన్న ఈ అమ్మడు 2019లో అతనితో నిశ్చాతర్థం జరుపుకున్నట్టు ప్రకటించింది.
తాజాగా ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ త్వరలోనే బుల్లి ట్రాన్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయం ప్రకటించిన వెంటనే అభిమానులు,సన్నిహితులు,శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్రిదా పింటో ‘ఇమ్మోర్టల్స్’, ‘రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్’ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘బ్రిటన్స్ వరల్డ్ వార్ 2’ తోపాటు ‘స్పై ప్రిన్సెస్: ద లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. నిర్మాతగాను సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది.