గురువారం 28 మే 2020
Cinema - Apr 28, 2020 , 23:10:53

నిరుపేదలకు ఆపన్నహస్తం

నిరుపేదలకు ఆపన్నహస్తం

‘కరోనా సంక్షోభసమయంలో నాకు సాధ్యమైన మేరకు సాయం అందిస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను’ అని తెలిపింది పాప్‌గాయని స్మిత.  లాక్‌డౌన్‌ కారణంగా  ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు స్మిత. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ బృందంతో కలిసి స్మిత 82 వేల మంది నిరుపేదల ఆకలి తీర్చారు.  ‘ఇప్పటివరకు 82360 మందికి భోజనం పెట్టాం. ఇప్పుడు నిత్యవసరాల్ని అందించే  పనిని ప్రారంభిస్తున్నాం’ అని ట్విట్టర్‌ ద్వారా స్మిత తెలిపింది. logo