మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 00:10:29

నాలుగు సినిమా హక్కులు

నాలుగు సినిమా హక్కులు

నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీనివాస్‌ నాలుగు పెద్ద సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నారు. రవితేజ ‘క్రాక్‌', గోపీచంద్‌ ’సీటీమార్‌', శర్వానంద్‌ ’శ్రీకారం’, రానా ‘విరాటపర్వం’ నైజాం హక్కుల్ని దక్కించుకున్నారాయన. పోటీ మధ్య ఈ సినిమా హక్కుల్ని పొందారాయన. కరోనా ప్రభావం కారణంగా థియేటర్లు మూతపడటంతో వేసవిలో విడుదలకావాల్సిన ఈ సినిమాలన్నీ వాయిదాపడ్డాయని, పరిస్థితి సాధారణస్థాయికి చేరుకున్న తర్వాత ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకురానున్నట్లు శ్రీనివాస్‌ చెప్పారు. ఈ సినిమాలతో పాటు  అగ్ర హీరోల చిత్రాల్ని నైజాంలో విడుదల చేసేందుకు నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పంపిణీదారుడిగా కొనసాగుతూనే ఇటీవల చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారాయన. విభిన్నమైన కథాంశంతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ యాభైశాతం పూర్తయింది. మిగతా భాగాన్ని విదేశాల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు కొత్త చిత్రాల్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. 


logo