దసరా బరిలో నాలుగు భారీ సినిమాలు.. గెలుపెవరిది?

ఓ కాలెండర్ ఇయర్ ఇంత దారుణంగా వేస్ట్ అయిపోతుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదేమో..? కానీ అందరి కళ్ల ముందు నుంచి 2020 అలాగే వెళ్లిపోయింది. ఎన్నో వందల సినిమాలు.. కోట్ల కోరికలు.. వేలాది మంది కార్మికుల కష్టాలు అన్నీ కరోనా కష్టాల్లోనే కలిసిపోయాయి. ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా తీసుకురాలేని పరిస్థితి.. షూటింగ్స్ ఆగిపోయిన పరిస్థితి.. ఏం చేయాలో తెలియని సందిగ్ధం.. అలా అంతా కరోనాకు బలైపోయింది. 2020 అంతా పండగలు లేవు.. కనిపించిందంతా కరోనా మాత్రమే. మరోవైపు తగ్గిపోతుందేమో అనుకున్న కరోనా కాస్తా ఇప్పుడు సెకండ్ వేవ్ చూపిస్తుందనే ప్రచారం మొదలైంది. దాంతో 2020 సినిమా ఇండస్ట్రీకి కూడా కలిసిరాలేదు. దాంతో 2021 సమ్మర్ వరకు కూడా ఇదే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి.
సంక్రాంతికి కూడా సినిమాలు విడుదల చేస్తామని చెప్పినా కూడా తీసుకొచ్చే ధైర్యం అయితే ఏ దర్శక నిర్మాత కూడా చేయడం లేదు. ఈ క్రమంలోనే చాలా మంది హీరోల కన్ను 2021 సెకండాఫ్ పైనే పడుతుంది. సంక్రాంతికి రెడ్, క్రాక్, రంగ్ దే, అరణ్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు వస్తాయని ప్రకటించినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే వచ్చేలా మాత్రం కనిపించడం లేదు. ఇవన్నీ సమ్మర్ వరకు వస్తాయా లేదా అనేది కూడా అనుమానమే. కానీ దసరా వరకు మాత్రం మరో నాలుగు భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. అవే చిరంజీవి ఆచార్య.. మహేష్ బాబు సర్కారు వారి పాట.. ప్రభాస్ రాధే శ్యామ్ అల్లు అర్జున్ పుష్ప.
ఈ నాలుగు సినిమాల షూటింగ్స్ అనుకున్న సమయానికి పూర్తి చేస్తే దసరాకు విడుదల కావడం ఖాయమే. ఇప్పటికే చిరంజీవి ఆచార్య షూటింగ్ సగం పూర్తయింది.. సర్కారు వారి పాట మొదలు కాబోతుంది.. మరోవైపు పుష్ప షూటింగ్ కూడా అడవుల్లో వేగంగా జరుగుతుంది. ప్రభాస్ రాధే శ్యామ్ చివరి దశకు వచ్చేసింది. ఇవన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేసి దసరాకు తీసుకురావాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తున్నారు. అన్నీ ఒకేసారి వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ తప్పేలా లేదు. కానీ పరిస్థితులు అలాగే ఉన్నాయి. దర్శక నిర్మాతల దగ్గర ఆప్షన్ కూడా లేదు. మరి చూడాలిక.. 2021లో సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో..?
తాజావార్తలు
- వీడీసీసీతో సమస్యలుండవ్
- పారిశ్రామిక వాడలో పచ్చదనం
- పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి
- స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
- సామాన్యుడిలా సంజయ్‌కుమార్
- వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్ కప్' టోర్నీ
- ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు
- ఊర చెరువుకు పైపులైన్ వేయించాలి
- రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి