ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 00:29:42

సమాజానికి సందేశంతో..

సమాజానికి సందేశంతో..

ఇంటికి దీపం ఇల్లాలుగా వుండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారో తెలిపే కథాంశానికి సందేశం జోడించి రూపొందించిన చిత్రం ‘ఫోర్‌ప్లే’ అంటున్నాడు నిర్మాత రాంబాబు. ఆయన నిర్మాణంలో పాలకుర్తి ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. తప్పకుండా అందర్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది’ అన్నారు.


logo