బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 21:33:11

"అక్కా నాకు భయమేస్తుంది.. నన్ను చంపేస్తారేమో?!"

ముంబై : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన మరణానికి ముందు కుటుంబసభ్యులకు తాను ఆపద ఎదుర్కొంటున్న సంకేతాలను పంపించినట్లు తెలిసింది. తన సోదరి మీతూ సింగ్ కు పంపిన ఎస్ఓఎస్ లో.. అక్కా నాకు భయమేస్తుంది.. నన్ను చంపేస్తారేమో? అన్న అనుమానంగా ఉంది అని పంపినట్లుగా వెల్లడైంది.

తన ఆత్మహత్యకు ఐదు రోజుల ముందు తన కుటుంబానికి ఈ ఎస్ఓఎస్ పంపినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన  సమాచారం మేరకు.. సుశాంత్ తన సోదరి మీతు సింగ్ కు తాను ఆపదలో ఉన్నానని తెలియజేసే సందేశాన్ని పంపాడు. తన భద్రత గురించి సుశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. "ముజే డర్ లాగ్ రహా హై, ముజే మార్ దేంగే" అని ఆ ఎస్ఓఎస్ లో తన భయాన్ని తెలియజేశాడు. ఇలాంటి సందిగ్ధ సమయంలో నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తులు నన్ను ఏదో ఒక దానిలో ఇరుక్కునేలా చేస్తారని భయపడుతున్నాను అని ఆ సందేశంలో పేర్కొన్నాడు. అయితే ఇతర పనుల్లో ఉండి తమ్ముడి సందేశానికి అక్క మీతూ సింగ్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. 

సుశాంత్ సింగ్ స్నేహితురాలు రియా చక్రవర్తి తన బాంద్రా అపార్ట్మెంట్ నుంచి విడిపోయిన తర్వాత జూన్ 9 న ఈ ఎస్ఓఎస్ పంపబడిందని గుర్తించారు. సుశాంత్ మాజీ మేనేజర్ దిషా సాలియన్ తన ఇంట్లో చనిపోయినట్లు గుర్తించిన ఒక రోజు తర్వాత కూడా ఇది వచ్చిందని తెలిసింది. సుశాంత్ కేసు మాదిరిగానే ఇప్పుడు దిషా సాలియన్ మరణం కేసును హత్య కేసుగా ఆరోపిస్తున్నారు. ఇంతలో  సుశాంత్ మరణ కేసులో వెలువడిన డ్రగ్స్ కోణంపై దర్యాప్తులో భాగంగా సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయ సాహా సోమవారం నాడు ముంబైలోని ఎన్‌సీబీ-సిట్ కార్యాలయం ఎదుట విచారణకు హాజరయ్యారు. అలాగే సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీకి కూడా ఎన్‌సీబీ-సిట్ సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తితోపాటు డజను మందిని ఎన్‌సీబీ ఇప్పటికే అరెస్టు చేసింది.


logo