హాంకాంగ్, ఏప్రిల్ 3: ప్రపంచ ప్రఖ్యాత హ్యూమనాయిడ్ రోబో సోఫియా బహుముఖ ప్రజ్ఞాశాలి. సోఫియా చక్కగా మాట్లాడుతుంది. ‘చిత్రకళ’లోనూ నైపుణ్యం ఉంది. అందుకే సోఫియా సృష్టించిన ‘డిజిటల్ ఆర్ట్‌వర్క్’ వేలంపాటలో 6,88,888 డాలర్లు (రూ.5.5 కోట్లు) పలికింది. సోఫియా చిత్తరువులను ఇటలీ చిత్రకారుడు ఆండ్రియా బొనాసిటొ గీశారు. వాటితో సోఫియా న్యూరల్ నెట్‌వర్క్‌ల ద్వారా డిజిటల్ ఆర్ట్‌వర్క్‌ను పూర్తిచేసింది. ఇది నాన్-ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) రూపంలో అమ్ముడుపోయింది. హాంకాంగ్‌కు చెందిన డేవిడ్ హాన్సన్ సృష్టించిన సోఫియా సంగీత సాధనపై దృష్టి పెట్టింది.
ఇవి కూడా చదవండి :
‘క్యాపిటల్’ వద్ద కారు బీభత్సం