మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 22, 2020 , 10:13:30

నామినేష‌న్‌లో సేఫ్ అయిన కంటెస్టెంట్ ఎవ‌రంటే..!

నామినేష‌న్‌లో సేఫ్ అయిన కంటెస్టెంట్ ఎవ‌రంటే..!

హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒక‌రిగా ఉన్న అభిజిత్‌ను త‌న తండ్రి, మామ‌తో మాట్లాడే అవ‌కాశం ద‌క్కింది. ఇందుకు పోయిన వారం మెహ‌బూబ్‌కు బ‌దులు ఎవ‌రు ఎలిమినేట్ కావాల్సింది అన్న ప్ర‌శ్న‌కు మోనాల్ అని స‌మాధానం ఇవ్వ‌డంతో నాగార్జున .. అభి ఫ్యామిలీని స్టేజ్ మీద‌కు ఆహ్వానించారు. అభి ల‌వ్ స్టోరీ మీకు తెలుసా అని నాగ్..ఆయ‌న మామ‌తో అన‌గా , ఏం లేదని చెప్పేశాడు.ఇక   టాప్ 5లో అభిజిత్‌, సోహైల్‌, హారిక‌, అఖిల్‌, మోనాల్ ఉంటార‌ని తెలిపాడు అభిజిత్ తండ్రి. సోహైల్‌ని కొంచెం కోపం తగ్గించుకోమ‌నే స‌ల‌హా కూడా ఇచ్చాడు.

ఇక  మోనాల్‌కు.. ఇంట్లో ఎవ‌రిని న‌మ్మ‌కుండా ఉంటే బాగుండేది అనుకున్నావు అన్న ప్ర‌శ్న ఎదురు కాగా, అభిజిత్ పేరు చెప్పింది. దానికి అభిజిత్ కూడా సేమ్ ఫీలింగ్ అన్నాడు. అయితే మోనాల్ త‌ల్లి బిగ్ బాస్ స్టేజ్‌పైకి రాగా, ఆమెని చూసి ఆనంద భాష్పాలు కార్చింది మోనాల్. అభిజీత్ త‌న ఫేవ‌రేట్ అంటూ మోనాల్ త‌ల్లి చెప్పుకొచ్చింది. అభిజిత్, మోనాల్‌, అఖిల్‌, లాస్య‌, సోహైల్ టాప్ 5లో ఉంటార‌ని ఆశీర్వాద‌మిచ్చింది. అంత‌క‌ముందు నాగార్జున‌కు ఓ గిఫ్ట్ ఇచ్చింది. అది చూసి నాగ్ సంతోషించారు

అవినాష్‌కు ఎవ‌రు సెల్ఫిష్ అనే ప్ర‌శ్న ఎదురు కాగా, లాస్య అని చెప్పాడు. కాని దానికి స‌రైన కార‌ణం చెప్ప‌ని కార‌ణంగా వాళ్ల త‌మ్ముడితో మాట్లాడే అవ‌కాశాన్ని కోల్పోయాడు. ఇక లాస్ట్ నుండి టాప్ 3 కంటెస్టెంట్స్ అయిన మోనాల్‌, లాస్య‌, అవిన‌ష్‌లు త‌మ‌కు ఇష్ట‌మైన వ‌స్తువుల‌ని తీసుకురావాల‌ని అన్నాడు. దీంతో లాస్య‌.. జున్ను ఫొటో, అవినాష్.. ప‌ర్ఫ్యూమ్‌, మోనాల్ త‌న సోద‌రి ఇచ్చి బ్రేస్ లేట్ గిఫ్ట్ ని తెచ్చారు. వీటిని స్టోర్ రూంలో పెట్టాల‌ని నాగ్ అన‌డంతో అంతా షాక‌య్యారు. ఇక చివ‌రిగా నామినేష‌న్‌లో ఉన్న సోహైల్‌ని సేఫ్ చేసి శనివారం ఎపిసోడ్‌కు గుడ్ బై చెప్పారు నాగ్. అయితే లీకుల స‌మాచారాన్ని బ‌ట్టి ఈ రోజు లాస్య ఇంటి నుండి నిష్క్ర‌మిస్తుంద‌ని తెలుస్తుంది.


logo