నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్న చిత్రం ‘చరిత కామాక్షి’. స్త్రీ లంక చందుసాయి దర్శకుడు. రజనీ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో యూత్‌తో పాటు కుటుంబ వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్ర తప్పకుండా నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాకీ వనమాలి, సంగీతం: అబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ ఎమ్ఎస్కె.