బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 11:24:01

విక్రాంత్ రోనాగా సుదీప్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

విక్రాంత్ రోనాగా సుదీప్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

వైవిధ్య‌మైన చిత్రాల‌లో విభిన్న పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్. అనూప్ భండారీ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం ఫాంట‌మ్ అనే సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ వ‌ల‌న చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డ‌గా, ఇటీవ‌ల ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌తి స‌భ్యుడు కూడా కోలీవుడ్ ఫిలిం ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారే అని సుదీప్ గ‌తంలో పేర్కొన్నారు.

కొద్ది సేప‌టి క్రితం ఫాంట‌మ్ చిత్రంలో విక్రాంత్ రోనా అనే పాత్ర పోషిస్తున్న సుదీప్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో సుదీప్ చేతిలో గ‌న్ ప‌ట్టుకొని రాయ‌ల్‌గా కూర్చొని ఉన్నారు.  ఈ ఫోటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 


logo