గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 00:03:11

గృహిణి గమనం

గృహిణి గమనం

గత కొన్నేళ్లుగా సినిమాల వేగాన్ని తగ్గించింది శ్రియ. నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటోంది. కొంతవిరామం తర్వాత శ్రియ తెలుగులో నటిస్తోన్న చిత్రం ‘గమనం’. సుజనారావు దర్శకురాలు. రమేష్‌ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ నిర్మాతలు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. శ్రియ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆమె ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు క్రిష్‌ విడుదలచేశారు. చీరకట్టుతో మెడలో మంగళసూత్రం ధరించి సాధారణ గృహిణిగా డీగ్లామర్‌ లుక్‌లో శ్రియ కనిపిస్తోంది. ‘రియల్‌ లైఫ్‌ డ్రామా ఇది. అనుకోకుండా వచ్చిన  ఆపద నుంచి ఓ సాధారణ గృహిణి ఎలా బయటపడింది? ఆమె సాగించిన పోరాటమేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. త్వరలో ప్రధాన తారాగణం వివరాల్ని వెల్లడిస్తాం. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం, సాయిమాధవ్‌బుర్రా సంభాషణలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం. జ్ఞానశేఖర్‌.వి.ఎస్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజనారావు. 

తాజావార్తలు


logo