గురువారం 26 నవంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 23:39:39

రాధాకృష్ణుల ప్రణయం

రాధాకృష్ణుల ప్రణయం

అనురాగ్‌, ముస్కాన్‌ సేథీ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధాకృష్ణ’. పుప్పాల సాగరిక నిర్మాత.  టి.డి. ప్రసాద్‌వర్మ దర్శకుడు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీనివాసరెడ్డి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వపర్యవేక్షణ చేస్తున్నారు.   నిర్మాణ సారథి పుప్పాల కృష్ణకుమార్‌ జన్మదినం సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన నిర్మల్‌ కొయ్యబొమ్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. పొనికి చెక్కతో ప్రాణంపోసుకునే ఈ బొమ్మల తయారీపై  ఆధారపడి ఎంతో మంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. ప్లాస్టిక్‌ బొమ్మల తాకిడి వల్ల ఈ కళాకారులు జీవితాలు ఎలాంటి కుదుపులకు లోనయ్యాయన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సందేశానికి హృద్యమైన ప్రేమకథను జోడించి రూపొందిస్తున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకు సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. సంపూర్ణేష్‌బాబు, అలీ, కృష్ణభగవాన్‌, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేందర్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ.