శనివారం 06 మార్చి 2021
Cinema - Jan 02, 2021 , 11:19:56

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డ్ సాధించిన ర‌వితేజ‌

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డ్ సాధించిన ర‌వితేజ‌

విల‌న్‌గా త‌న కెరీర్ మొద‌లు పెట్టిన ర‌వితేజ ఆ త‌ర్వాత హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇడియ‌ట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి చిత్రాల‌తో ర‌వితేజ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. బెంగాల్ టైగ‌ర్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకొన్న ర‌వితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు ఏవి కూడా స‌క్సెస్ కాలేక‌పోయాయి. 

ప్ర‌స్తుతం  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ కాప్ డ్రామా.. కాప్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్బంగా విడుద‌లైంది. ఈ మాస్ ట్రైలర్ చూసాక ఈ చిత్రంపై అంచనాలు మరింత స్థాయిలో పెరిగిపోయాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ట్రైల‌ర్‌కు క‌నెక్ట్ అయ్యారు. 24 గంటలు పూర్తి కాకముందే భారీ వ్యూస్ మరియు లైక్స్ తో రవితేజ కెరీర్ లోనే రికార్డు సెట్ చేసింది. కేవలం 20 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడమే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా దాదాపు 2 లక్షల మేర లైక్స్ సాధించి రవితేజ కెరీర్ లోనే సాలిడ్ రీచ్ అందుకున్న ట్రైలర్ గా నిలిచింది. 

క్రాక్  చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ కథానాయిక‌గా నటించగా రవిశంకర్, సముథ్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు పవర్ ఫుల్ విలన్స్ గా కనిపిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఠాగూర్ మధు నిర్మాణం వహించారు.

VIDEOS

logo