బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 11:32:23

చిన్నారి హ‌త్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖ న‌టి

చిన్నారి హ‌త్య‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖ న‌టి

తమిళనాడు రాష్ట్రం పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన‌ జయప్రియ అనే ఏడేళ్ల బాలిక కామాంధుల చేతిలో బ‌లికావ‌డం ప్ర‌తి ఒక్క‌రిలో ఆగ్ర‌హ‌జ్వాల‌ల‌ని ర‌గిలింప‌జేస్తుంది. రెండో  త‌ర‌గ‌తి చ‌దువుతున్న చిన్నారిని అమానుషంగా అత్యాచారం చేసి.. హత్య చేయ‌డంపై ప్ర‌తి ఒక్క‌రు మండిప‌డుతున్నారు  #JusticeForJayapriya అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ట‌ర్‌లో హోరెత్తిస్తూ ఆమెకి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

సినీ నటి సాయి ప‌ల్లవి ఇప్ప‌టికే దీనిపై స్పందిస్తూ.. సంచ‌లన కామెంట్స్ చేసింది. తాజాగా త‌మిళ న‌టి వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కూమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా.. స‌మాజంలో ఏం జ‌రుగుతోంది అని మండిప‌డింది. ఎలాంటి స‌మాజంలో మ‌నం నివ‌సిస్తున్నాం. చిన్నారిపై అత్యాచారం చేసి చంప‌డం ఎంత దారుణం. మ‌నమంద‌రం క‌రోనా వైర‌స్ బారిన ప‌డి క‌న్నుమూయాల్సిందే అంటూ వ‌ర‌ల‌క్ష్మీ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది . సభ్యసమాజంలో  చిన్నారిపై జరిగిన హత్యాచారం చూస్తుంటే మనమంతా బ్రతికేందుకు అనర్హులమనే భావన కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ‌ర‌ల‌క్ష్మీ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. 

తాజావార్తలు


logo