మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 09:52:55

అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం.. త‌ప్పిన ముప్పు

అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం.. త‌ప్పిన ముప్పు

శుక్ర‌వారం ఉద‌యం అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ స‌ర్క్యూట్ జ‌ర‌గ‌డంతో ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్టు తెలుస్తుంది. అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే స్పందించి సంఘ‌ట‌నా స్థలానికి చేర‌కొని మంట‌ల్ని ఆర్పివేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ న‌ష్టం ఏమి జ‌ర‌గకపోగా, ఆస్తి న‌ష్టం కూడా పెద్ద‌గా జ‌ర‌గ‌లేద‌ని స్టూడియో మేనేజ‌ర్ స్ప‌ష్టం చేశారు.

 అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందనే వార్త బ‌య‌టకు రావ‌డంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉలిక్కిప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే బిగ్ బాస్ హౌజ్ సెట్ ఉండ‌డంతో అందులో ఉన్న ఇంటి స‌భ్యుల గురించి ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ప్ర‌మాదం పెద్ద‌ది కాక‌పోవ‌డంతో బిగ్ బాస్ నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. 


logo