మంగళవారం 07 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 21:55:06

నిర్మాత ఎక్తా కపూర్‌పై ఎఫ్‌ఐఆర్‌

నిర్మాత ఎక్తా కపూర్‌పై ఎఫ్‌ఐఆర్‌

ఇండోర్‌: టెలివిజన్‌ నిర్మాత ఎక్తా కపూర్‌పై మధ్యప్రదేశ్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఇండోర్‌ నివాసితులు వాల్మిక్‌ సకరాగయే, నీరజ్‌ యాగ్నిక్‌లు శుక్రవారం రాత్రి ఎక్తా కపూర్‌, ఇతరులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసుల ఎక్తా కపూర్‌, మరికొందరిపై కేసు నమోదు చేశారు. తన వెబ్‌ షో ‘ట్రిపుల్‌ ఎక్స్‌ సీజన్‌ 2’ లో అశ్లీల సీన్లను చూపడం, మతపరమైన భావాలను దెబ్బతీయడం, జాతీయ చిహ్నాలను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలపై నిర్మాత ఏక్తా కపూర్‌తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని పోలీసులు తెలిపారు. భారత సైన్య యూనిఫాంను అత్యంత అభ్యంతరకర సన్నివేశాలలో ఉపయోగించడం వల్ల వాటి విలువలకు భంగం కలిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఎక్తా కపూర్‌తో పాటు వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్‌ పంఖుడి రోడ్రిగ్స్‌, స్క్రీన్‌ రైటర్‌ జెస్సికా ఖురానాల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నట్లు అన్నపూర్ణ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ సతీష్‌ కుమార్‌ ద్వివేది తెలిపారు. ‘ఏక్తా కపూర్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఏఎల్‌టీ బాలాజీలో వెబ్‌ సిరీస్‌ ‘ట్రిపుల్‌ ఎక్స్‌ సీజన్‌ 2’ తీవ్ర అశ్లీలతను వ్యాప్తి చేయడమే కాకుండా ఒక మతానికి చెందిన భావాలను దెబ్బతీసింది’ అని ఫిర్యాదులో వారు పేర్కొన్నట్లు పోలీసు అధికారి చెప్పారు.

భారతీయ శిక్షాస్మృతి ఐటి చట్టం, స్టేట్‌ ఎంబెల్మ్‌ ఆఫ్‌ ఇండియా చట్టం 2005, 294, 298 (అశ్లీల చర్యలు), 298 (మతపరమైన భావాలను కించపరచాలనే ఉద్దేశ్యం) సెక్షన్ల కింద ఎక్తా కపూర్‌, ఇతరులపై కేసు నమోదు చేయబడింది. 


logo