గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Nov 01, 2020 , 02:00:23

భూమిక కీలక పాత్రలో సినిమా చిత్రీకరణ

 భూమిక కీలక పాత్రలో సినిమా చిత్రీకరణ

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కథాబలమున్న వైవిధ్యమైన సినిమాల్ని ఎంచుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది  సీనియర్‌ కథానాయిక భూమిక. తాజాగా తెలుగులో విభిన్నమైన పాత్రలో  ఆమె కనిపించబోతున్నది. సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, తాన్యాహోప్‌ ప్రధాన పాత్రల్లో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది.  గురుపవన్‌ దర్శకుడు. జి.మహేష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. శుక్రవారం నుంచి ఆమె ఈ సినిమా చిత్రీకరణలో భాగమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ ‘సుదీర్ఘ విరామం తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టడం ఆనందంగా ఉంది’ అని తెలిపింది. ‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న రోడ్‌ మూవీ ఇది. నాలుగు పాత్రల నేపథ్యంలో సాగుతుంది’ అని సుమంత్‌ అశ్విన్‌ చెప్పారు.  ఏడు నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చానని, త్వరలో థియేటర్లు పునఃప్రారంభమై ఇండస్ట్రీ పూర్వస్థితికి రావాలని శ్రీకాంత్‌ అన్నారు. లాక్‌డౌన్‌కు ముందు యాభైశాతం చిత్రీకరణను పూర్తిచేశామని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై  కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నామని దర్శకుడు చెప్పారు. సప్తగిరి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, పృథ్వీ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌.