శుక్రవారం 29 మే 2020
Cinema - Mar 15, 2020 , 15:42:51

‘కరోనా’ టైటిల్స్‌ రిజిస్టర్‌ చేస్తున్న దర్శకులు.

‘కరోనా’ టైటిల్స్‌ రిజిస్టర్‌ చేస్తున్న దర్శకులు.

ముంబై: కరోనా (కోవిడ్‌-19)వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా ప్రబలకుండా ఇప్పటికే పలువురు తారలు తమ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా ప్యాకప్‌ చెప్పేస్తున్నారు. కొన్నాళ్లుగా ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో..పలువురు బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు కరోనా పేరు వచ్చేలా సినిమా టైటిల్స్‌ రిజస్టర్‌ చేసే పనిలో పడుతున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ ప్రస్తుతం కరోనా ప్యార్‌ హై పేరుతో ఓ టైటిల్‌ను రిజిస్టర్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

2000లో హృతిక్‌రోషన్‌ హిట్‌ చిత్రం కహో నా ప్యార్‌ హై..కు కొనసాగింపుగా ఈ పేరును రిజిస్టర్‌ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం స్రిప్ట్‌ పనులు కొనసాగుతున్నాయి. ప్రేమ కథ నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుంది. కథ తుదిమెరుగులు దిద్దుకున్న తర్వాత వెంటనే ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకువెళ్తామని ఎరోస్‌ ప్రతినిధి కృషిక లుల్లా తెలిపారు. దీంతోపాటు డెడ్‌లీ కరోనా అనే పేరుతో పాటు మరికొన్న టైటిల్స్‌ను కూడా దర్శకనిర్మాతలు నమోదు చేసుకున్నారట. 


logo