గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 00:21:13

రియా చక్రవర్తిపై బయోపిక్‌?

రియా చక్రవర్తిపై బయోపిక్‌?

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు విచారణలో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. రియా చక్రవర్తి అందించిన సమాచారంతో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న పలువురు బాలీవుడ్‌ నాయికల్ని ఎన్సీబీ విచారిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు అంతర్జాతీయంగా కూడా మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ ప్రజల్లో రియా చక్రవర్తిపై సానుభూతి పెరుగుతోంది. అపరిపక్వ ఆలోచనలతో తెలియకుండానే ఆమె ఈ ఊబిలో చిక్కుకుపోయిందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రియాచక్రవర్తిపై బయోపిక్‌తో పాటు డాక్యుమెంటరీ తీసేందుకు బాలీవుడ్‌లో దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఆమె జీవిత కథ ఆధారంగా ఓ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం రియా చక్రవర్తి ముంబయిలోని బైకుల్లా మహిళా కారాగారంలో ఉంది.


logo