శనివారం 30 మే 2020
Cinema - Apr 07, 2020 , 12:21:05

షార్ట్ ఫిల్మ్‌: క‌రోనా కోసం ఒక్క‌టైన భార‌తీయ సినీ పరిశ్ర‌మ‌

షార్ట్ ఫిల్మ్‌: క‌రోనా కోసం ఒక్క‌టైన భార‌తీయ సినీ పరిశ్ర‌మ‌

క‌రోపై అవ‌గాహ‌న క‌ల్పించడ‌మే కాకుండా లాక్‌డౌన్ కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇబ్బంది ప‌డుతున్న పేద కార్మికుల‌ని ఆదుకునేందుకు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు న‌డుం బిగిస్తున్నారు. తాజాగా భార‌తీయ సినిమా పరిశ్ర‌మ‌కి చెందిన అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, ర‌ణ్‌బీర్ క‌పూర్, ప్రియాంక చోప్రా, అలియా భ‌ట్‌, మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి, ప్రసేజ్ జిత్ చ‌ట‌ర్జీ, సోనాలి కుల‌క‌ర్ణి, శివ రాజ్‌కుమార్, దిల్జిత్ దోసాంగ్ వంటి స్టార్స్ ఏకంగా ఒక షార్ట్ ఫిలిం రూపొందించారు. ప్ర‌సూన్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సోని పిక్చ‌ర్స్‌, క‌ళ్యాణ్ జ్యూయ‌ల‌ర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ షార్ట్ ఫిలిం ముఖ్య ఉద్ధేశం దిన‌స‌రి కూలీల‌కి తొడ్పాటునందించేందుకు నిధులు సేక‌రిచండమే అని అంటున్నారు.

షార్ట్ ఫిలింలో అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న క‌ళ్ళ‌ద్దాల కోసం వెతుకుతుంటారు. అవి దొర‌క్క‌పోవ‌డంతో ర‌ణ్‌వీర్ సింగ్‌, దిల్జీత్ దోసంజ్ కూడా వెతికే ప‌నిలో ప‌డ‌తారు. ఇక ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి,  అలియా భ‌ట్‌, మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి, ప్రసేజ్ జిత్ చ‌ట‌ర్జీ, సోనాలి కుల‌క‌ర్ణి, శివ రాజ్‌కుమార్ వారి వారి ప‌నుల‌తో బిజీగా ఉన్న స‌మ‌యంలో ర‌ణ్‌వీర్ వెళ్లి క‌ళ్ళ‌ద్దాల గురించి ఆరా తీస్తారు. చివ‌రికి ఆ కూలింగ్ గ్లాసెస్‌ని ప్రియాంక చోప్రా.. అమితాబ్‌కి ఇస్తుంది. ఈ షార్ట్ ఫిలింలో ఆయా హీరోలు వారివారి భాష‌ల‌లో మాట్లాడ‌డం విశేషం.  ఈ షార్ట్ ఫిలింలో న‌టించిన వారంద‌రు వారి వారి ఇళ్ల‌ల్లోనే ఉండి న‌టించారు. భారతీయ సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టే అని చాటేందుకే ఇది చేశామ‌ని వారు అంటున్నారు. క‌రోనా త‌రిమికొట్టాలంటే ప్ర‌తి ఒక్క‌రు ఇంట్లోనే ఉండాల‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు


logo