శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 10, 2020 , 15:53:06

సినీ ప‌రిశ్ర‌మ సాఫ్ట్ టార్గెట్ అవుతుంది: అదితీరావు హైద‌రి

సినీ ప‌రిశ్ర‌మ సాఫ్ట్ టార్గెట్ అవుతుంది: అదితీరావు హైద‌రి

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణం తర్వాత బాలీవుడ్ లో డ్ర‌గ్స్ లింక్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కొంత‌మంది తార‌ల‌ను టార్గెట్ చేయ‌డంపై న‌టి అదితీరావు హైద‌రి స్పందించింది. ప్ర‌స్తుతం హిందీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై విచారం వ్య‌క్తం చేసింది.

మేము ప‌రిస్థితుల‌ను బ‌ట్టి సంబంధిత స‌మ‌స్య గురించి మాట్లాడినపుడు ఒక తప్పు ప‌దాన్ని ఉప‌యోగిస్తే, ప్ర‌తీ ఒక్క‌రూ ఆ వ్య‌క్తిని టార్గెట్ చేస్తారు. ప్ర‌తీ విషయంలో చిత్ర‌ప‌రిశ్ర‌మ పాత్ర‌, బాధ్య‌త ఎలా ఉంటుందని..? ఇది స‌రైన విధానం కాద‌ని వాపోయింది. ఇపుడు సినీ ప‌రిశ్ర‌మ సాఫ్ట్ టార్గెట్ అయిపోతుంద‌ని అదితీ రావు హైద‌రి అభిప్రాయ‌ప‌డింది. ఇటీవ‌లే ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ డైరెక్షన్‌లో వ‌చ్చిన వీ చిత్రంలో న‌టించింది అదితీ రావు హైద‌రి. ఈ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo