శనివారం 30 మే 2020
Cinema - May 20, 2020 , 10:32:21

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం అనుమ‌తి కోరిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం అనుమ‌తి కోరిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ

లాక్‌డౌన్ వ‌ల‌న థియేటర్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. ఇండ‌స్ట్రీకి సంబంధించి అన్ని షూటింగ్స్‌కి లాక్ ప‌డింది. దీని వ‌లన ఈ రెండు నెల‌లో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న చాలా సినిమాలు ఆగిపోయాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని సంఘాలు క‌నీసం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల కోసం అనుమ‌తులు ఇవ్వాల‌ని ముఖ్యమంత్రుల‌కి విన‌తి ప‌త్రాలు అంద‌జేస్తున్నారు. తాజాగా ది ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా సినీ ఎంప్లాయిస్‌(ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రికి లేఖ రాసారు. 

లాక్‌డౌన్ వ‌ల‌న ఎఫ్‌డబ్ల్యూఐసీఈలోని 32 క్రాఫ్ట్స్‌కి చెందిన వ‌ర్క‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌తో పాటు నిర్మాత‌లు చాలా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి సంబంధించిన ప‌నులు చేసుకునేందుకు వీలు క‌ల్పించాలని లేఖ రాసారు. మ్యూజిక్, సౌండ్ రికార్డింగ్ వంటి ప‌నుల వ‌ల‌న చాలా సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. మీరు ప‌ర్మీష‌న్ ఇస్తే కొద్ది మందితో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేస్తాం. లాక్‌డౌన్ ఎత్తేయ‌గానే ఆ సినిమాల‌ని రిలీజ్ చేయ‌డానికి సాధ్య‌ప‌డుతుంది. దీని వ‌ల‌న నిర్మాత‌లకి కొంత ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది అని లేఖ‌లో పేర్కొంది . మ‌రి ఎఫ్‌డబ్ల్యూఐసీ విన‌తిపై మ‌హ‌రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుంద‌నేది చూడాలి.


logo