మణికాంత్, శీతల్భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకుడు. జి.నరసింహగౌడ్ నిర్మాత. సునీల్ కీలక పాత్రధారి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణ వేడుక ఇటీవల జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఫైటర్ శివ పోరాటం ఎందుకోసమన్నది ఆకట్టుకుంటుంది. సునీల్ సీబీఐ అధికారిగా కనిపిస్తారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశాం’ అన్నారు. రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, లాక్డౌన్ అనంతరం చివరి షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.