బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 20:59:43

చివరి నిమిషంలో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే..

చివరి నిమిషంలో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే..

హైదరాబాద్‌: 'బిగ్‌బాస్ తెలుగు' సీజన్-4 పదమూడో   వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. అందులో ఒకరికి నేరుగా ఫినాలే టికెట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. దాంతో ఒకరు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. ఇప్పటికే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ నుంచి అరియానా, అవినాష్, మోనాల్ ఎలిమినేట్ అయిపోయారు. అభిజిత్, హారిక, అఖిల్, సోహెల్ ఫైనల్ టికెట్ కోసం రేసులో ఉన్నారు. 

ఇదిలా ఉంటే ఈ వారం సోహైల్, అరియానా మాత్రమే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. మిగిలిన ఐదుగురు నామినేట్ అయ్యారు.  ఈ వారం ఇంటి నుంచి అవినాష్ బయటికి వెళ్ళిపోతాడని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. గతవారమే ఈయన ఎలిమినేట్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా ఇంకా ఇంట్లోనే ఉన్నాడు.  అవినాష్‌కు ప్రేక్షకుల నుంచి  ఊహించినంత సపోర్ట్ లేదని గత వారమే అర్థమైపోయింది. దానికి తోడు గత కొన్ని రోజులుగా ఇంట్లో  వ్యవహరిస్తున్న తీరు ప్రేక్షకులకు అస్సలు నచ్చడంలేదు. నామినేషన్స్ లోకి వస్తే అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు అవినాష్. దానికి తోడు ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కూడా మధ్యలోనే వదిలేశాడు. 

ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారం అవినాష్ ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఒకటి ఎదురైనట్లు ఇప్పుడు తెలుస్తోంది. ఈ వారం కూడా అవినాష్ సేవ్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. మోనాల్ గజ్జర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోనుందని తెలుస్తోంది. గుజరాతి అమ్మాయి అయినా కూడా 12 వారాలు ఇంట్లోనే ఉండగలిగింది మోనాల్.  ఈమెకు వచ్చిన సపోర్టు.. పడుతున్న ఓట్లు చూసి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాకవుతున్నారు.   గుజరాత్ నుంచి ఈమెకు ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం మాత్రం ఈ ముద్దుగుమ్మ ప్రయాణం ముగిసిపోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఎక్కడో అహ్మదాబాద్ నుంచి వచ్చి ఒక తెలుగు షోలో 85 రోజులకు పైగా ఉండడం అంటే చిన్న విషయం కాదు. కానీ మోనాల్ ఇది చేసి చూపించింది. అయితే ఇన్ని రోజులు ఎంత సపోర్ట్ వచ్చినా కూడా చివరి నిమిషంలో గేమ్ మరింత కఠినంగా మారుతుంది. దాంతో ఇన్ని రోజుల ఈమె జర్నీకి ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం నూటికి నూరు శాతం మోనాల్ ఎలిమినేట్ కావడం ఖాయం అని తెలుస్తోంది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. వచ్చేవారం అవినాష్ కథ ముగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఎలా చూసుకున్నా కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అఖిల్, అభిజిత్, అరియానా, హారిక, సోహైల్ ఉండబోతున్నారు.logo