గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 08, 2020 , 07:24:11

నెయ్యి కోసం సోహైల్‌- అరియానా ఫైట్...!

నెయ్యి కోసం సోహైల్‌- అరియానా ఫైట్...!

బిగ్ బాస్ సీజ‌న్ 4లో శ‌నివారం ఎపిసోడ్ చాలా ఎమోష‌న‌ల్‌గా న‌డిచింది. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ శుక్ర‌వారం బిగ్ బాస్ హౌజ్‌లో ఏం జ‌రిగిందో చూపించారు. ముందుగా ఎలిమినేష‌న్ గురించి అవినాష్‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ చ‌ర్చించారు. అరియానా జోస్యం చెబుతూ..అవినాష్, అభిజిత్, హారిక, మోనాల్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని జోస్యం చెప్పింది. ఇక అమ్మా రాజ‌శేఖ‌ర్ కెప్టెన్సీ గురించి అఖిల్‌తో ముచ్చ‌టించిన హారిక‌.. ఐదు సార్లు కెప్టెన్సీ పోటీలో పాల్గొన్న నాకు రేష‌న్ మేనేజ‌ర్  ప‌దవి ఇవ్వ‌కుండా అవినాష్‌కు ఎలా ఇస్తారని వాపోయింది 

ఇక నెయ్యి విష‌యంలో అరియానా- సోహైల్ మ‌ధ్య మ‌ళ్ళీ వాగ్వాదం జ‌రిగింది. ఆడ పిల్ల‌తో ఎలా మాట్లాడాలో కూడా తెలియ‌దంటూ అరియానా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. నేనే మ‌గాడిలా ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే నా హార్ట్ చెప్పిన‌ట్టు చేస్తా. నాకు మ‌న‌సు ఉంది. అది గాయ‌ప‌డుతుంది. అంటూ అవినాష్‌తో చ‌ర్చించింది. ఈ మ‌ధ్య‌లో సోహైల్ తెగ ఆవేశ‌ప‌డుతుండ‌గా అత‌నిని కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు అఖిల్ 

ఇక ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడిన నాగార్జున‌.. కొత్త కెప్టెన్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు వెల్‌క‌మ్ చెబుతూ..హౌజ్‌లో ఎవ‌రి మీద అయిన కంప్లైంట్స్ ఉన్నాయా అని అభిజిత్‌ని అడిగారు. దీనికి అభిజీత్.. మాస్ట‌ర్ మేము చెప్పేది వినరు అన్నారు. దీనికి నాగార్జున మేం ప‌నిష్మెంట్స్ ఇచ్చినా కూడా నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడ‌డం ఆపుతున్నావా. నీకు ఇది మైన‌స్, ఆయ‌న‌కు ఇది మైన‌స్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే టీ స్టాండు టాస్క్‌లో ద‌గ్గ‌ర ఆత్మ‌గౌర‌వం అంటూ ఆట‌ మ‌ధ్య‌లో నుంచి నిష్క్ర‌మించ‌డాన్నినాగ్ త‌ప్పు ప‌ట్టారు. నాగ్ మాట‌ల‌కి ఇంటి స‌భ్యులు కూడా స‌పోర్ట్ చేయ‌డంతో అభిజీత్ సైలెంట్ అయ్యాడు


logo