గురువారం 04 జూన్ 2020
Cinema - May 01, 2020 , 11:40:20

అజిత్‌కి పోటీగా విజ‌య్ ఫ్యాన్స్ ర‌చ్చ‌..!

అజిత్‌కి పోటీగా విజ‌య్ ఫ్యాన్స్ ర‌చ్చ‌..!

ఈ రోజు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బ‌ర్త్ డే కావ‌డంతో ఆయన అభిమానులు హెచ్ బి డి డియరెస్ట్ అజిత్  అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియా‌లో అనేక ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో విజ‌య్ ఫ్యాన్స్ కూడా ది పేస్ ఆఫ్ కోలీవుడ్ అనే యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తూ అజిత్ ఫ్యాన్స్‌కి పోటీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు హీరోల మ‌ధ్య వార్ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది.

అజిత్‌, విజ‌య్ ఫ్యాన్స్‌ల మ‌ధ్య గ‌తంలో కూడా అనేక సార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. త‌మ హీరో గొప్పంటే త‌మ హీరో గొప్ప అని పోటీల‌కి దిగుతూ ప్రాణాలు పోగొట్టుకున్న సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. హీరోలు మంచిగా ఉన్న‌ప్ప‌టికీ, అభిమానుల మ‌ధ్య ఈ వైరాలు ఎందుకో అని విశ్లేషకులు హెచ్చ‌రిస్తున్నారు విజయ్ నటించిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉండగా, అజిత్ వాలిమై షూటింగ్ లో పాల్గొంటున్నారు.


logo