మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 11:59:21

ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు రానుంది ఎవ‌రు?

ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు రానుంది ఎవ‌రు?

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం 16 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభం కాగా, మ‌ధ్య‌లో ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఒక్కో వారం ఒక‌రు ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నారు. తొలివారం సూర్య‌కిర‌ణ్ ఎలిమినేట్ కాగా, రెండో వారం క‌ళ్యాణి, మూడో వారం దేవి నాగ‌వ‌ల్లి, నాలుగో వారం స్వాతి దీక్షిత్ ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ళారు. ఇక ఐదో వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై ఆస‌క్తిక‌ర చర్చ న‌డుస్తుంది.

గ‌త సీజ‌న్‌ల‌కు భిన్నంగా సీజ‌న్ 4  ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. మూడో సీజ‌న్‌లో ప్ర‌తి ఆదివారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌ ఉండేది. కాని ఇప్పుడు ఒక్కోసారి శ‌నివార‌మే పంపించేస్తున్నారు. గ‌తంలో గెస్ చేసిన వారు దాదాపు ఎలిమినేట్ అయ్యారు. కాని ఇప్పుడు మాత్రం ఊహించ‌ని విధంగా ఎలిమినే‌ట్ అవుతున్నారు. దేవి, స్వాతిల ఎలిమినేష‌న్‌ని అస్స‌లు ఎవ‌రు ఊహించి ఉండ‌రు.  

ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో సుజాత‌, రాజ‌శేఖ‌ర్, లాస్య‌, అభిజిత్, అమ్మ రాజ‌శేఖ‌ర్, అఖిల్, అరియానా, సోహైల్‌‌, నోయ‌ల్ ఉండ‌గా వీరిలో అభిజిత్‌, అఖిల్‌, మోనాల్‌, అరియానా, లాస్య, సోహైల్‌ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లుగా ఉన్నారు. కొన్ని రోజుల వ‌ర‌కు వీరికి ఎలాంటి ఢోఖా లేదు. ఇప్పుడు అస‌లు ప్రాబ్ల‌మ్ సుజాత‌, అమ్మ రాజ‌శేఖ‌ర్, నోయ‌ల్‌ల‌కే. వీరు ముగ్గురికి స్క్రీన్ స్పేస్ త‌క్కువ‌. దాంతో పాటు ఇంట్లో పెద్ద‌గా యాక్టివ్‌గా క‌నిపించ‌డం లేదు. సుజాత ప్ర‌వ‌ర్త‌న‌తో బాగా విసిగిపోయిన ప్రేక్ష‌కులు ఆమెను ఈ రోజు ఇంటి నుండి పంపించ‌నున్నార‌ని అంటున్నారు. ఏదైన అద్భుతం జ‌రిగితే అమ్మ లేదా నోయ‌ల్‌లో ఒకరు బ‌య‌ట‌కు వెళ‌తార‌ని టాక్.


logo