బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 12:23:57

బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌తో స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్న ప్ర‌భాస్

బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్‌తో స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్న ప్ర‌భాస్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ అనే చిత్రంతో పాటు ఆదిపురుష్ చిత్రం, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా, ఈ మూవీకి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రానుంది.

కొద్ది సేప‌టి క్రితం ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అక్టోబ‌ర్ 23న మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల కానుంద‌ని వింటేజ్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. రాధేశ్యామ్ స‌ర్‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్  ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో ప్ర‌భాస్ స్వ‌యంగా అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వ‌డంతో అభిమానుల‌లో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది.  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ వింటేజ్ లవ్ స్టోరీని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారుlogo