శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 18:10:30

రకుల్‌ విచారణతో టాలీవుడ్‌లో గుబులు..!

రకుల్‌ విచారణతో టాలీవుడ్‌లో గుబులు..!

సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద ఆత్మహత్య విచారణలో భాగంగా డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన  సంగతి తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక్కొక్కరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్సీబీ అధికారులు దీపికా పదుకునే , సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్ ‌లతో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు సమన్లు జారీ చేశారట. కాగా రేపు రకుల్‌ ఎన్‌.సి.బి అధికారుల ఎదుట విచారణకు హాజరుకానుంది. అయితే రకుల్‌ మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కోవడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో అలజడి ప్రారంభమైంది.

రకుల్‌తో సన్నిహిత సంబంధాలున్న టాలీవుడ్‌ ప్రముఖులు టెన్షన్‌ పడుతున్నారు. ఈ విచారణ రకుల్‌తో ఆగుతుందా..? టాలీవుడ్ ప్రముఖులకు కూడా చుట్టుకుంటుందా..? అని గుబులు పడుతున్నారు. గతంలో కూడా టాలీవుడ్‌ లో పలువురు ప్రముఖులు డ్రగ్స్‌ వ్యవహారంలో విచారణకు హాజరైన సంగతి విదితమే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.