ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 09:55:08

మూడేళ్ళ వ‌య‌స్సులోనే లైంగిక వేధింపులు: ద‌ంగ‌ల్ న‌టి

మూడేళ్ళ వ‌య‌స్సులోనే  లైంగిక  వేధింపులు: ద‌ంగ‌ల్ న‌టి

అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన దంగ‌ల్ చిత్రంలో గీతా ఫోగ‌ట్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించిన అందాల భామ ఫాతిమా స‌నా షేక్. ఈ అమ్మ‌డు తాజాగా త‌న‌కు మూడేళ్ళ వ‌య‌స్సులోనే లైంగిక వేధింపులు ఎదుర‌య్యాయ‌ని చెప్పుకొచ్చింది. జాతీయ మీడియాతో మాట్లాడిన ఫాతిమా..లైంగిక వేధింపుల స‌మ‌స్య చుట్టూ క‌ళంకం ఉంది. అందుకే ఎవ‌రు బ‌య‌ట‌కు చెప్ప‌లేక‌పోతున్నారు. అంద‌రు చ‌దువుకోవ‌డం వ‌ల‌న దీనిపై అవ‌గాహ‌న పెరుగుతుంది. దీనిపై కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు అని చెప్పుకొచ్చింది.

కాస్టింగ్ కౌచ్‌పై కూడా స్పందించిన ఫాతిమా.. ఉద్యోగం కావాలంటే సెక్స్ కు ఒప్పుకోవ‌ల‌సిందే అని అన్నారు. కాని ఏ రోజు దానికి అంగీక‌రించ‌లేదు. ఇలా ఉండ‌డం వ‌ల‌న‌నే సినిమా ఆఫ‌ర్స్ కూడా త‌గ్గాయి అంటూ జీవితంలో ఎదురైన అనేక విషాద సంఘ‌ట‌న‌ల‌ను వివరించింది.  కాగా, లుడో, సూర‌జ్ పే మంగ‌ల్ భ‌రీ అనే చిత్రాల‌తో బిజీగా ఉంది ఫాతిమా.