మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 17:33:46

న‌న్ను షారుక్ సినిమాలో తీసుకోండి

న‌న్ను షారుక్ సినిమాలో తీసుకోండి

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ 2018లో వ‌చ్చిన జీరో చిత్రం త‌ర్వాత మ‌రే సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. త‌న అభిమాన న‌టుడి కొత్త సినిమా ప్ర‌క‌ట‌న ఎప్పుడుంటుందా..? అని ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. షారుక్ వీరాభిమానుల్లో దంగ‌ల్ ఫేం బ్యూటీ ఫాతిమా స‌నా షేఖ్ కూడా ఒక‌రు. షారుక్ కొత్త చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంద‌ట ఫాతిమా. త్రీ ఇడియ‌ట్స్‌, పీకే, సంజు వంటి సూప‌ర్ హిట్ సినిమాల డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీ త‌న కొత్త చిత్రాన్ని షారుక్ ఖాన్ తో తీస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న త‌ర్వాత ఫాతిమా డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీకి షారుక్ సినిమాలో న‌టించే అవ‌కాశ‌మివ్వాల‌ని మెసేజ్ పెట్టింద‌ట‌.

మేక‌ర్స్ కు వారి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసే ఉద్దేశంతో ఇలా వారికి అప్పుడ‌ప్పుడు సందేశాల‌ను పంపుతుంటాన‌‌ని చెప్పింది ఫాతిమా. తాను దిల్జీత్ దోసాంజ్, మ‌నోజ్ భాజ్‌పేయితో క‌లిసి సూర‌జ్ పే మంగ‌ళ్ భ‌రీ చిత్రంలో న‌టిస్తున్నానని చెప్పుకొచ్చింది. మ‌రి డైరెక్ట‌ర్ హిరానీ షారుక్ వీరాభిమాని (ఫాతిమా)కి అత‌ని సినిమాలో న‌టించే అవకాశ‌మిస్తాడో..?  లేదో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.