మంగళవారం 02 జూన్ 2020
Cinema - May 20, 2020 , 15:11:31

ఫర్హాన్‌ అక్తర్‌ ఔదార్యం..1000 పీపీఈ కిట్స్‌ అందజేత

ఫర్హాన్‌ అక్తర్‌ ఔదార్యం..1000 పీపీఈ కిట్స్‌ అందజేత

ముంబై: బాలీవుడ్‌ నటుడు పర్హాన్‌ అక్తర్ కరోనా పరిస్థితుల నేపథ్యంలో తనవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. పర్హాన్‌ ముంబైలోని కామా ఆస్పత్రికి 1000 పీపీఈ కిట్స్‌ను అందజేశాడు. ట్రింగ్‌ ప్లాట్‌పాం వేదికగా సెలబ్రిటీలతో కలిసి మరో 1000 పీపీఈ కిట్స్‌ కోసం విరాళం అందించాలని కోరుతున్నాడు.

ముంబైలోని కామా ఆస్పత్రికి వెయ్యి పీపీఈ కిట్స్‌ పంపడం ఆనందంగా ఉంది. కరోనాపై పోరు చేస్తున్న వైద్యసిబ్బందికి సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. పీపీఈ కిట్స్‌తో మన వైద్యారోగ్య సిబ్బంది సురక్షితంగా ఉంటారు. జై హింద్‌ అని ట్వీట్‌ చేశాడు పర్హాన్‌. పీపీఈ కిట్స్‌ బాక్స్‌ల ఫొటోలను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo