బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 11:45:35

ద‌య‌చేసి ఇలాంటి పోస్టులు పెట్టొద్దంటున్న డైరెక్ట‌ర్‌!

ద‌య‌చేసి ఇలాంటి పోస్టులు పెట్టొద్దంటున్న డైరెక్ట‌ర్‌!

లాక్‌డౌన్‌తో అంద‌రూ ఇంట్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు క‌త్రినా కైఫ్‌, అనిల్‌క‌పూర్, జాక్వెలిన్ ఫెర్నాండెస్‌లాంటి వారు ఇంటిప‌ట్టునే ఉంటూ వ‌ర్కౌట్స్ చేస్తున్నారు. మ‌రికొంత‌మంది ఇంట్లో అన్ని ప‌నులు స్వ‌యంగా చేసుకుంటున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటికి కొంత‌మంది నుంచి మంచి స్పంద‌న బాగానే వ‌స్తున్నా మ‌రికొంత‌మంది ఈ స‌మ‌యంలో ఇటాంటివి వ‌ద్దంటున్నారు.

ఆదివారం నాడు క‌రీనా క‌పూర్ ఇంట్లో వ‌ర్కౌట్స్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. విత్ అవుట్ మేక‌ప్‌లో కూడా అందంగా ఉన్నావ్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దీనికి 55 ఏండ్ల బాలీవుడ్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ ఫ‌రా ఖాన్ మాత్రం భిన్నంగా వీడియో పెట్టింది. 'ప్ర‌స్తుతం  ప్ర‌జ‌లంతా క‌రోనాతో భ‌య‌ప‌డుతున్నారు. మీకు అన్నీ స‌దుపాయాలు ఉన్నాయ‌ని వ‌ర్కౌట్స్ చేస్తున్నారు. ఈ టైంలో కూడా మీరు అందం గురించి ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. చేత‌నైతే పేద‌వారిని ఆదుకోండి. అంతేకాని అవ‌స‌రం లేని పోస్టులు పెట్టొద్దు'. అని వీడియోలో నిర్ముహ‌హ‌మాటంగా చెప్పేసింది డైరెక్ట‌ర్ ఫ‌రా. logo