యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక సలార్, ఆదిపురుష్ సెట్స్ పై ఉన్నాయి. ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలు అతి త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్నాయి.
శనివారం ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్ఛాలు, పూలదండలతో వందలాదిగా తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి సైతం అభిమానులు అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేకులు కట్ చేశారు. ప్రభాస్‌ని చూసేందుకు శుక్రవారం అర్ధరాత్రి 12:00 నుంచి ఎదురుచూశారు.
ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ నేపథ్యంలో ముంబైలో ఉన్నారు. దీంతో అభిమానులకి నిరాశే ఎదురైంది. అయితే అభిమానులను అడ్డుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో భోజనాలు, వయోవృద్ధులకు పండ్లు ఫలహారాలు పంచిపెట్టారు. మొదటినుంచి ఆయన పుట్టినరోజునాడు ఆయన కుటుంబీకులు చుట్టు ప్రక్కల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే.