ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 12:07:46

నియాశర్మ సైక్లింగ్ వీడియో..మాస్క్ లేదన్న అభిమాని

నియాశర్మ సైక్లింగ్ వీడియో..మాస్క్ లేదన్న అభిమాని

నాగిన్ సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల తార నియాశర్మ. సోషల్ మీడియాలో ఈ భామకున్న ఫాలోవర్ల సంఖ్య ఎక్కువే. నియా శర్మకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అందరూ ఇటీవల ఓ సాయంత్రం ముంబై వీధుల్లో సైక్లింగ్ చేసింది నియాశర్మ. రన్నింగ్ ఔట్ ఫిట్ లో సైకిల్ రైడ్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే కొంతమంది ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తుంటే..మరికొందరు అభిమానులేమో కరోనా విజృంభిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ముఖానికి మాస్క్ లేకుండా బయటకు రావడంపై నియాశర్మకు ప్రశ్నలు సంధిస్తున్నారు.

దీనికి తనదైన శైలిలో సమాధానమిచ్చింది నియా. నేను వీడియోలో మాస్కు లేకుండా ఉండటంపై నెటిజన్లు ఎందుకు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం మాస్క్ వేసుకుని మాత్రమే ఫొటో దిగాలి. వీడియోలో రావాలనే నిబంధన ఉందని నాకు తెలియదు. నా చుట్టూ 40 మంది ఉండి..షూటింగ్ చేయాల్సి వచ్చినపుడు కెమెరా ముందు నా పాత్ర కోసం మాస్కు ధరించను. అలాగే నేను సైక్లింగ్ చేస్తున్నపుడు స్వచ్చమైన గాలి పీల్చుకునేందుకు కొన్ని సెకన్లపాటు మాస్కు తీసెస్తా. నా చుట్టూ ఎవరూ లేరనే విషయం మీకు వీడియోలో అర్థమవుతుందంటూ రిప్లై ఇచ్చింది. 


View this post on Instagram

Ride and glide ????

A post shared by Nia Sharma (@niasharma90) on


logo