బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 27, 2020 , 09:44:41

లాక్‌డౌన్ త‌ర్వాత మాధ‌వ‌న్ ఇలా..!

లాక్‌డౌన్ త‌ర్వాత మాధ‌వ‌న్ ఇలా..!

కరోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జలంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినిమా సెల‌బ్రిటీలు కూడా షూటింగ్‌ల‌కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో క‌లిసి ఆనంద క్ష‌ణాలు గ‌డుపుతున్నారు. అయితే ప్ర‌పంచాన్ని వణికిస్తున్న క‌రోనాతో పాటు లాక్‌డౌన్‌పై కూడా ప‌లు మీమ్స్ క్రియేట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ నెటిజ‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో 21 రోజుల లాక్ డౌన్ త‌ర్వాత మాధ‌వ‌న్ ఇలా గ‌డ్డంతో క‌నిపిస్తారు అని ఫోటోలు షేర్ చేశాడు. దీనిపై స్పందించిన మాధ‌వ‌న్ .. న‌వ్వుతూ, దేశ ప్ర‌జ‌ల హితం కోసం ఇలా ఉండ‌డానికి సిద్ధ‌మే అని కామెంట్ పెట్టారు. మాధ‌వ‌న్ ట్వీట్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం రాకెట్రీ :  ది నంబి ఎఫెక్ట్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మాజీ సైంటిస్ట్ నంబీ నారాయ‌ణ‌న్ జీవిత నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.  


logo