గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 22:06:31

ప్రముఖ బాలీవుడ్ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స

ప్రముఖ బాలీవుడ్ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స

హైద‌రాబాద్ : బాలీవుడ్‌లో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరో నటుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆషికీ సినిమాతో బాలీవుడ్‌నే కాదు ఇండియానే ఊపేసిన ప్రముఖ నటుడు రాహుల్ రాయ్. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. 22 ఏళ్లకే బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈయన ఆషికితో అభిమానుల‌ను పిచ్చోళ్లను చేశాడు. ఈ సినిమా పాటలు ఇప్పటికీ అద్భుతమే. ఆ ఒక్క సినిమాతోనే రాహుల్‌కు సూప‌ర్ క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత అదే గుర్తింపును ఆయన కొనసాగించలేకపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన 'ఎల్ఏసీ' సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సమయంలోనే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ప్రస్తుతం కార్గిల్‌లో ఉన్న వాతావ‌ర‌ణం కార‌ణంగా రాహుల్ రాయ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తెలిపారు. దాంతో వెంటనే షూటింగ్ నిలిపేశారు. అక్కడ్నుంచి రెండు రోజుల కిందటే రాహుల్ రాయ్‌ను ముంబైకి త‌ర‌లించి ఆస‌త్రిలో చేర్చారు. ప్రస్తుతం ఈయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ విష‌యాన్ని రాహుల్ రాయ్ సోద‌రుడు రోమీర్ సేన్ మీడియాకు వెల్ల‌డించాడు. అయితే కంగారు పడాల్సిన పనేం లేదన్నారు. కోలుకుంటున్న‌ట్లుగా తెలిపాడు. ఇప్పుడిప్పుడే ఆయ‌న‌ స్పృహలోకి వస్తున్నట్లు చెప్పాడు.

తాజావార్తలు


logo