డ్రైవర్‌ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ వివాదంలో ఇరుక్కున్నాడు. ఈయన ఓ కారు డ్రైవర్‌పై చెయ్యి చేసుకోవటంతో కాంట్రవర్సీ రేగింది. దాంతో పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది. డ్రైవర్‌ను కొట్టడమే కాకుండా అసభ్యంగా తిట్టినందుకు ఈయనపై కేసు ఫైల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్ మంజ్రేకర్ జనవరి 16 రాత్రి 11:30 గంటల సమయంలో తన కారులో పుణె నుంచి సోలాపూర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఓ చోట డ్రైవర్ కైలాష్ సత్పుతే సడెన్‌గా కారును ఆపాడు. అదే సమయంలో వెనకాల వస్తున్న మరో కారు మహేష్ కారును ఢీ కొట్టింది. దాంతో ఆయన కారు డ్యామేజ్ అయింది. సొట్టలు కూడా పడింది. దాంతో ఆగ్రహానికి గురైన మహేష్ వెంటనే దిగి కారు డ్రైవర్‌ను కొట్టాడు. అంతటితో ఆగకుండా బండ బూతులు తిట్టాడు. మనస్తాపానికి గురైన కారు డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహేష్‌పై ఫిర్యాదు చేశాడు.
పోలీసులు పలు సెక్షన్ల కింద నటుడిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇదే విషయంపై మహేష్ మంజ్రేకర్ కూడా మీడియాకు వివరాలను వెల్లడించారు. తాను కారు ఆగిన తర్వాత వెనక నుంచి వచ్చి ఢీ కొట్టారని.. ఆ సమయంలో తనతో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారని చెప్పుకొచ్చాడు. వాళ్లకు కూడా గాయాలైనట్లు చెప్పాడు మహేష్. అంతేకాదు తన కారుకు కూడా దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. అవన్నీ ఎవరు భరిస్తారంటున్నాడు.
అయినా కూడా తనకు ఆ సమయంలో ఉన్న అర్జెన్సీ వల్ల ఏం అనకుండా వెళ్లిపోయానని.. ఎందుకంటే మరోచోట తనకోసం షూటింగ్ కోసం టీం వేచి చూస్తుండటంతో పోలీస్ కేసు కూడా పెట్టలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే తాను తిరిగి కేసు ఫైల్ చేస్తానని చెప్పాడు మహేష్ మంజ్రేకర్. ఏదేమైనా కూడా ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి
అరవింద్‌స్వామి-కంగనా రొమాంటిక్ లుక్..' తలైవి' పోస్టర్
‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
మరిది కోసం సినిమా సెట్ చేసిన సమంత..!
తెరపైకి నాగార్జున-పూరీ కాంబినేషన్..?
కీర్తిసురేశ్ లుక్ మహేశ్‌బాబు కోసమేనా..?
రవితేజకు రెమ్యునరేషన్ ఫార్ములా కలిసొచ్చింది..!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
- చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్