శుక్రవారం 29 మే 2020
Cinema - Apr 07, 2020 , 23:14:44

కరోనాపై ‘ఫ్యామిలీ’ లఘు చిత్రం

కరోనాపై ‘ఫ్యామిలీ’ లఘు చిత్రం

కరోనా మహమ్మారిని నిర్మూలించే యజ్ఞంలో సినీ తారలందరూ భాగమవుతున్నారు. వివిధ వేదికల ద్వారా ప్రజల్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సోషల్‌మీడియాను కేంద్రంగా చేసుకుంటున్నారు. తాజాగా వివిధ భాషల్లోని ప్రముఖ తారలందరూ కలిసి ‘ఫ్యామిలీ’ పేరుతో ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. స్వీయగృహ నిర్భంధం, భౌతిక దూరాల్ని పాటించే అవశ్యకతను తెలియజేస్తూ ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు రూపకల్పన చేశారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, చిరంజీవి, ప్రియాంకచోప్రా, రణభీర్‌కపూర్‌, అలియాభట్‌, ప్రొసేన్జీజ్‌ చటర్జీ, శివరాజ్‌కుమార్‌ వంటి అగ్రతారలు నటించారు. అమితాబ్‌బచ్చన్‌ తన కళ్లజోడు ఎక్కడుందని అడగడం..దానిని గురించి మిగతా తారలందరు అన్వేషించడం అనే కాన్సెప్ట్‌తో ఈ లఘు చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో నటించిన తారలందరూ వారివారి ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటం విశేషం. ‘మేమంతా మా సొంత గృహలకు పరిమితమైపోయి ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించాం. ప్రతి నటుడు తనకు సంబంధించిన వీడియోను షూట్‌ చేసి అందించాడు. ఈ ఫుటెజ్‌ను అంతా కలిసి ఓ చిత్రంగా రూపొందించాం. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు అందరూ ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణకు కృషి చేయాలి. భాషలు వేరైనా మేమంతా సినీ కళామతల్లి బిడ్డలం అని తెలియజేసేందుకే ఈ లఘు చిత్రాన్ని రూపొందించాం. కొన్ని టీవీ ఛానల్స్‌, స్పాన్సర్స్‌తో కలిసి కొంత నగదు కలెక్ట్‌ చేయబోతున్నాం. దీనిని దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో పనిచేస్తున్న దినసరి కార్మికులకు అందజేయాలని నిర్ణయించుకున్నాం’ అని అమితాబ్‌బచ్చన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ’ ఫార్ట్‌ ఫిల్మ్‌ దేశవ్యాప్తంగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.logo