రెండుమూడు రోజులుగా సినీనగర్ లో ఓ వార్త హడావుడి చేస్తోంది. అదేంటంటే రౌడీ హీరోతో దర్శకుడు సుకుమార్ చేయబోయే సినిమా ఆగిపోయిందని, లేదులేదు వాయిదా పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో హడావుడి చేశాయి. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ ఫాల్కన్ అధికారిక ప్రకటన చేసింది. ఇలాంటి రూమర్లు నమ్మవద్దని కోరింది.
విజయ్ దేవరకొండతో సుకుమార్ చేయబోయే సినిమా త్వరలోనే ఉంటుందని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. దర్శకుడు సుక్కు, హీరో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే ఈ సినిమా మొదలవుతుందని వివరణ ఇచ్చింది. అంతేకాదు అన్నీఅనుకున్న విధంగానే ఈసినిమా భారీగా తెరకెక్కనుందని ఫాల్కన్ టీమ్ ప్రకటించింది.