ప్రతిభతో పాటు కష్టపడేతత్వమే చిత్రసీమలో సుదీర్ఘకాలం కొనసాగడానికి దోహదపడుతుందని చెబుతోంది రకుల్‌ప్రీత్‌సింగ్. అవుట్‌సైడర్స్, ఇన్సైడర్స్ అనే వ్యత్యాసాలను తానెప్పుడూ విశ్వసించనని అంటోంది. బాలీవుడ్లో ఇతర భాషల వారికి ఎదురయ్యే వివక్షను గురించి రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ ‘ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్ చర్చ ఇటీవల కొత్తగా మొదలైంది. ఇదివరకు ఆ మాటల్ని నేను వినలేదు. బాలీవుడ్లో ఎలాంటి వివక్షకు తావు లేదు. ప్రతిభ ఉంటే భాష పట్టింపులు లేకుండా ఎవరైనా రాణించవచ్చు. ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు అవకాశాల్ని తెచ్చిపెడతాయి. కానీ నటులుగా మనల్ని తిరస్కరించాలా? స్వీకరించాలా? అన్నది ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బాలీవుడ్లో వివక్షను నేను ఏ రోజూ ఎదుర్కొలేదు. హిందీ చిత్రసీమలో గ్లామర్ పాత్రలతో పాటు అభినయప్రధాన పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నా’ అని తెలిపింది.