స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో సుకుమార్ పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు.అయితే ప్రస్తుతం ‘మలయాన్కుంజు’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా, ఆయనకు పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
‘మలయాన్కుంజు’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఫహద్ ఫాజిల్ చాలా ఎత్తు నుండి కింద పడిపోయాడు. ఆ సమయంలో ఆయన తన భూమికి తగలకుండా చేతులు బ్యాలెన్స్ చేయడంతో క్షేమంగా బయటపడ్డాడు. ఎత్తు నుండి కింద పడేటప్పుడు చేతులు చాచి బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కాని అదృష్టవశాత్తు ఆ సమయంలో మెదడు చురుగ్గా పని చేయడంతో బతికి బట్టగట్టాను అంటున్నాడు ఫహద్. ఈ యాక్సిడెంట్లో తన ముక్కుకు గాయం కావడంతో మూడు కుట్లు వేశారని, నొప్పి మానడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నాడు.
ఇవి కూడా చదవండి..