మంగళవారం 26 మే 2020
Cinema - May 06, 2020 , 09:53:50

ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి.. ప‌ట్టాలెక్కేదెప్పుడో ?

ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి.. ప‌ట్టాలెక్కేదెప్పుడో ?

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన కామెడీ చిత్రం ఎఫ్‌2. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 రూపొందుతుంది. గ‌త కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ప‌నుల‌తో బిజీ అయ్యారు అనీల్ రావిపూడి అండ్ టీం. తాజాగా స్క్రిప్ట్ వ‌ర్క్ మొత్తం పూర్తి చేసార‌ని తెలుస్తుంది. ఇక లాక్‌డౌన్ పూర్త‌య్యాక  ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ మొద‌లు పెట్టి అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని అనీల్ భావిస్తున్నాడ‌ట‌.   

ఎఫ్ 3 చిత్రం వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లోనే రూపొందుతుంద‌ని, ద్వితీయార్ధంలో ఏదైన ఛాన్స్ ఉంటే మ‌రో హీరో గురించి ఆలోచిస్తామ‌ని ఇటీవ‌ల చెప్పుకొచ్చాడు అనీల్ రావిపూడి. హౌస్‌ఫుల్, గోల్ మాల్ త‌ర‌హా ఫ్రాంచైజీని తెలుగులోకి తీసుకొస్తున్నాం. వెంకీ ఆస‌నం ఎందుకు వేశాడు. కోబ్రో అంటూ వెంకీని వరుణ్ ఎందుకు క‌లిసాడు లాంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలని ఎఫ్ 3లో చూపించ‌నున్నార‌ట‌. వెంక‌టేష్ ప్ర‌స్తుతం నారప్ప చిత్రంతో బిజీగా ఉండ‌గా, వ‌రుణ్ బాక్స‌ర్ చిత్రం  చేస్తున్నాడు. వారి వారి ప్రాజెక్ట్స్ పూర్త‌య్యాక ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్ల‌నుంది. logo