మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 19:50:59

వెంకీ-వ‌రుణ్ 'ఎఫ్ 3' విడుద‌ల తేదీ ఫిక్స్‌

వెంకీ-వ‌రుణ్ 'ఎఫ్ 3' విడుద‌ల తేదీ ఫిక్స్‌

2020లో కొత్త సినిమాలు లేక వినోదానికి దూర‌మైన ప్రేక్ష‌కుల‌కు ఈ ఏడాది ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ దొర‌క‌నుంది. 2021లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది హీరోల విడుద‌ల తేదీలు ఒక్కొక్క‌టికి ఫిక్స‌వు‌తున్నాయి. వెంకీ-వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌స్తున్న ఎఫ్‌3 పైనే ఇపుడు అంద‌రి దృష్టి ప‌డ్డ‌ది. ఎఫ్3 ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎదురుచూస్తున్న సినీ ల‌వ‌ర్స్ కోసం ఫిలింన‌గ‌ర్ లో ఓ అప్‌డేట్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎఫ్ 3 చిత్రాన్ని ఆగ‌స్టు 27న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు.

ఎఫ్ 3 ఆగ‌స్టు 27న విడుద‌ల‌వుతుంద‌ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ట్విట‌ర్ ద్వారా తెలియజేశాడు. 2018లో సంక్రాంతి హిట్ గా నిలిచిన ఎఫ్‌2 చిత్రానికి ఇది సీక్వెల్‌. ఫ‌స్ట్ పార్టులో న‌టించిన‌ త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ ఎఫ్ 3లో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్ రెడ్డి ఇత‌ర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా..దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo