ఫలానా విటమిన్ మాత్రలతో ఒత్తయిన జుట్టు ఖాయం, ఫలానా విటమిన్ గోళీలతో మేనిఛాయ మెరుగుపడుతుంది, బరువు తగ్గొచ్చు.. అంటూ చాలా ప్రకటనలే వస్తుంటాయి. వాటివల్ల ఎంతోకొంత ఫలితమూ ఉండవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇంటెగ్రేటివ్ న్యూట్రిషనిస్ట్ పాయల్ కొఠారి. విటమిన్-బి6 మోతాదు మించితే ఆకలి చచ్చిపోతుంది. నరాల వ్యవస్థ ప్రభావితం అవుతుంది. విటమిన్-ఎ మాత్రలు కొందరికి పడకపోవచ్చు. అయినా దీర్ఘకాలంపాటు వాడటం వల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఎంతోకొంత సురక్షితమైందని చెప్పుకొనే విటమిన్-కె కూడా శ్రుతి మించితే గుండెపోటుకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కొఠారి.