మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 13:26:10

ఫీచ‌ర్ ఫిలింగా 'ఎఫ్ 2'‌ కు జాతీయ అవార్డు

ఫీచ‌ర్ ఫిలింగా 'ఎఫ్ 2'‌ కు జాతీయ అవార్డు

వెంక‌టేశ్‌-వ‌రుణ్ తేజ్ హీరోలుగా వ‌చ్చిన చిత్రం ఎఫ్‌2...(ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌). అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ చేసిన ఈ మూవీలో త‌మ‌న్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టించారు. ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా అరుదైన అవ‌కాశం ద‌క్కించుకుంది. కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాషల సినిమాల‌కు అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 

51వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుక‌ల్లో భాగంగా .. ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరిలో ఎఫ్2కు జాతీయ అవార్డు ల‌భించింది. ఈ అవార్డు సాధించిన ఏకైన తెలుగు సినిమాగా ఎఫ్2 నిల‌వ‌డం విశేషం. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, సుబ్బ‌రాజు, ప్రగ‌తి, నాజ‌ర్, ఈశ్వ‌రీరావు, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై విజ‌య కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఎఫ్2 మూవీని కుటుంబ‌స‌మేతంగా అంద‌రూ ఎంజాయ్ చేశారు. దేవీశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం మ్యూజిక్ లవ‌ర్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. 2018 జ‌న‌వ‌రిలో సంక్రాంతికి విడుద‌లైన ఎఫ్‌2 ఆ సీజ‌న్ లో అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ కు కూడా ప్లాన్ సిద్దం చేశాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.